ఎల్నినో ప్రభావంతో తెలంగాణ యాసంగి సాగులో వరికి ప్రత్యామ్నాయ పంటలను వేయాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. పప్పుధాన్యాలు, కూరగాయలు, నూనెగింజల సాగును ప్రోత్సహించేందుకు సబ్సిడీ విత్తనాలు అందుబాటులోకి తీసుకురావాలని సర్కార్ యోచిస్తోంది. అయితే గ్రామాల్లో కోతుల బెడద రైతులకు కొత్త తలనొప్పిగా మారింది. వరికి ప్రత్యామ్నాయంగా వేసే పంటలను కోతులు దెబ్బతీస్తాయనే భయం రైతుల్లో ఉంది. కోతులను తరిమేందుకు చేసిన ప్రయత్నాలు ఫలితాలు ఇవ్వలేదని రైతులు వాపోతున్నారు.