హైదరాబాద్‌లో సంచలనంగా మారిన ఎంఎంటీఎస్ అత్యాచారయత్నం ఘటన కేసులో రైల్వే పోలీస్ ఎస్పీ చందన దీప్తి కీలక విషయాలు వెల్లడించారు కదులుతున్న ఎంఎంటీఎస్ రైలులో అత్యాచారానికి యత్నించిన దుండగుడి నుంచి తప్పించుకునేందుకు రన్నింగ్ ట్రైన్ నుంచి బయటకు దూకిన బాధితురాలు.. తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. బాధితురాలిని ఎస్పీ చందన దీప్తి పరామర్శించారు. పరామర్శ అనంతరం మీడియాకు కీలక విషయాలు వెల్లడించారు. బాధితురాలు లేడిస్ కంపార్ట్ మెంట్‌లోనే ఎక్కిందని.. ఆమె ఎక్కిన సమయంలో మరో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారని.. మధ్యలో ఓ పురుషుడు కూడా ఎక్కినట్టు ఎస్పీ తెలిపారు.