యూట్యూబర్, టిక్ టాక్ స్టార్ ఫన్ బకెట్ భార్గవ్‌కు కోర్టు జైలు శిక్ష విధించింది. మైనర్ బాలికను గర్భవతిని చేశాడనే కేసులో విశాఖపట్నం పోక్సో కోర్టు ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్లు జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటుగా రూ.4 లక్షలు జరిమానా విధించింది. వెబ్ సిరీస్‌లలో అవకాశాలు ఇప్పిస్తానని మైనర్ బాలికను మోసం చేశారంటూ 2021లో ఫన్ బకెట్ భార్గవ్ మీద కేసు నమోదైంది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో ఫన్ బకెట్ భార్గవ్ మీద కేసు నమోదైంది. ఈ కేసులో విశాఖ పోక్సో కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.