యూట్యూబర్ హర్షసాయి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన ఓ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేప్ కేసు నమోదు కాగా.. అప్పటి నుంచి హర్షసాయి అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతన్ని పట్టుకునేందుకు పోలీసులు అన్ని రాకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే.. హర్షసాయికి మరో షాక్ ఇచ్చారు పోలీసులు. హర్షసాయి విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు.. లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు నార్సింగి పోలీసులు.