ఆధ్యాత్మిక గురువు శ్రీ గురు విశ్వస్ఫూర్తి స్థాపించిన స్ఫూర్తి కుటుంబం - తెలంగాణ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. పలు ప్రాంతాల్లో యోగా, ప్రాణాయామం, ధ్యానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు యోగా ప్రాముఖ్యతను వివరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత యోగా శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు స్ఫూర్తి కుటుంబసభ్యులు తెలిపారు.