woman gives birth on a train: ఖమ్మం జిల్లా మధిర సమీపంలో టాటా నగర్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ గర్భిణి రైలులోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పురిటి నొప్పులు రావడంతో తోటి ప్రయాణికులు, రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి, సమీప స్టేషన్‌లో వైద్య సహాయం అందించారు. రైల్వే సిబ్బంది సమయస్ఫూర్తితో సురక్షితంగా ప్రసవం జరగడంతో తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ సంఘటన రైల్వే శాఖ సత్వర సహాయానికి నిదర్శనంగా నిలిచింది.