సోషల్ మీడియాలో నిత్యం అనేక వార్తలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని నిజాలుంటే, చాలా వరకూ అసత్యాలు, అర్ధసత్యాలు ఉంటాయి. అలాంటిదే ఓ న్యూస్ క్లిప్పింగ్ నెట్టింట వైరల్ అవుతోంది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయాలకు వీడ్కోలు పలికి అమెరికాకు వెళ్లిపోతారంటూ ఓ వార్తా క్లిప్పింగ్ నెట్టింట వైరల్ అవుతోంది. దీని వెనుక అసలు వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.