ఏపీ రాజధాని నిర్మాణాన్ని ప్రభుత్వం వేగవంతం చేసింది. అమరావతిలో ఏయే పనులు తొలుత చేపట్టాలనే దానిపై ఇటీవల జరిగిన సీఆర్‌డీఏ సమావేశంలో నిర్ణయించారు. ఆ మేరకు అమరావతిలో చేపట్టే పనులకు ఆమోదం తెలుపుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 11 వేల కోట్ల రూపాయలతో 20 రకాల సివిల్ పనులు చేపట్టనున్నారు. పెండింగ్‌లో ఉన్న భవనాల నిర్మాణంతో పాటుగా, కాలువలు, డ్రెయిన్లు, వాకింగ్ ట్రాకులు, సైక్లింగ్ ట్రాకులు వంటి పనులు చేపట్టనున్నారు. ఈ ఈ పనులకు నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.