తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఓ యువతి చనిపోగా, 28 మందికి గాయాలయ్యాయి. బుధవారం రాత్రి ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు ప్రయాణికులతో బయల్దేరింది. బస్సు రాజమహేంద్రవరం కాతేరు సమీపంలోని గామన్ బ్రిడ్జిపై అర్ధరాత్రి సమయంలో బోల్తాపడింది.. ఈ ఘటనలో విశాఖపట్నంకు చెందిన హోమని అనే యువతి ప్రాణాలు కోల్పోయింది.. 28మందికి గాయాలు అయ్యాయి. వీరిలో పదిమందికి తీవ్ర గాయాలు కాగా.. మిగిలిన 18మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని వెంటనే రాజమహేంద్రవరంలోని ఆస్పత్రులకు తరలించగా.. తీవ్ర గాయాలైన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.