రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీకి గోల్డ్ మెడల్.. గవర్నర్ చేతుల మీదుగా సత్కారం

1 hour ago 1
రాజమండ్రి జైల్లో ఉన్న ఎన్‌.సురేశ్ అనే వ్యక్తి గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడంతోపాటు గోల్డ్‌ మెడల్‌ని కూడా సాధించాడు. తెలంగాణ గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా సురేశ్ ఈ పతకాన్ని అందుకున్నారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) ప్రాంగణంలో బుధవారం జరిగిన స్నాతకోత్సవం ఒక అరుదైన ఘట్టానికి వేదికైంది. ఈ సందర్భంగా జైలు సూపరింటెండెంట్ వి. సన్యాసిరావు హర్షం వ్యక్తం చేశారు. ఇది మిగతా ఖైదీలకు కూడా మంచి మోటివేషన్ అవుతుందని అన్నారు.
Read Entire Article