టీడీపీ ఎమ్మెల్యే, తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి వివాదంలో నిలిచారు. టీడీపీ నేత రమేష్ రెడ్డిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. 48 గంటల్లోగా ఆయనపై చర్యలు తీసుకోకపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. దీంతో కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారం మరోసారి టీడీపీలో చర్చనీయాంశమైంది. కొలికపూడి శ్రీనివాసరావును ఇప్పటికే ఓసారి అధిష్టానం పిలిపించి మాట్లాడిన సంగతి తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి అడుగులు ఉంటాయనేదీ ఆసక్తికరంగా మారింది.