Sudha Murthy Ram Mohan Naidu Rajya Sabha: రాజ్యసభలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ఎంపీ సుధా నారాయణమూర్తిపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రశంసలు కురిపించారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్లుపై మాట్లాడారు. ప్రసంగం మధ్యలో దాహం వేయడంతో మంచినీళ్లు కావాలని కోరారు.. ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇంతలో ఆ పక్కనే ఉన్న ఎంపీ సుధామూర్తి (ఇన్ఫోసిస్) వాటర్ బాటిల్ ఇచ్చారు. సుధామూర్తికి థ్యాంక్స్ చెప్పిన రామ్మోహన్ నాయుడు .. తల్లిలా ఎప్పుడూ కేరింగ్‌గా చూసుకుంటారన్నారు. ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.