అనంతపురం జిల్లాలోని రాప్తాడు హైస్కూల్లో విద్యార్థినులపై దాడి చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తరగతి గదిలోకి చొరబడి బాలికపై చెట్లను కట్ చేసే మెషిన్‌తో విచక్షణారహితంగా దాడి చేసిన ఉన్మాదిని హేమంత్గా పోలీసులు గుర్తించారు.అలాగే ఈ ఘటనపై సీఎం చంద్రబాబునాయుడు స్పందించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. మళ్లీ ఇలాంటి రిపీట్ కాకూడదని సూచించారు. అలాగే బాధిత కుటుంబంతో మాట్లాడి అండగా ఉంటామని చంద్రబాబునాయుడు ధైర్యం ఇచ్చారు.