Akividu Ramalayam Rs 40 Lakhs In One Day: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ఆకివీడు పెదపేటలో ఉన్న శ్రీరాముని ఆలయ పునర్నిర్మాణం కోసం నిధులు సేకరిస్తున్నారు. రామాలయానికి భక్తులు రూ.100 నుంచి రూ.10వేల వరకు విరాళాలు అందించాలని రఘురామ కోరారు. ఈ మేరకు ఆయన పిలుపునిచ్చిన వెంటనే ప్రజలు విరాళాలు అందజేస్తున్నారు. అయితే ఒక్కరోజులో రూ.40 లక్షలు సమకూరాయని డిప్యూటీ స్పీకర్ రఘురామ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.