Foundation For AMCA Project In Puttaparthi: రాయలసీమకు మరో భారీ ప్రాజెక్ట్ వచ్చింది. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్టు నిర్మాణానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రూ.15,803 కోెట్లతో 650 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మరికొన్ని ప్రాజెక్టులకు పుట్టపర్తి నుంచి వర్చువల్‌గా శంకస్థాపన చేశారు.