తెలంగాణలో అవినీతి రహిత పాలన లక్ష్యంగా ఏసీబీ 2025లో ఉక్కుపాదం మోపింది. ఈ ఏడాది 199 కేసులు నమోదు చేసి.. 15 మంది భారీ అక్రమార్కులను పట్టుకుంది. నీటిపారుదల శాఖ, రవాణా శాఖ అధికారులపై జరిగిన సోదాలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి. సామాన్యులను పీడించే చిన్న స్థాయి ఉద్యోగులపై కూడా ఏసీబీ నిఘా పెట్టింది.