రాష్ట్రంలో దారుణ ఘటన.. కేవలం రూ.22 కోసం.. తన ప్రాణ స్నేహితుడిని చంపేశాడు..

7 months ago 21
మెదక్ జిల్లా చేగుంట మండలం అనంతసాగర్ గ్రామంలో కేవలం 22 రూపాయల బాకీ కోసం జరిగిన గొడవ ఒక వ్యక్తి ప్రాణాన్ని బలితీసుకుంది. ఉత్తరప్రదేశ్ నుండి వలస వచ్చిన మహ్మద్ సిరాజ్, మహేశ్ కుమార్ వర్మ పండుగ నాడు కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో పాత బాకీ 22 రూపాయలు తిరిగి ఇవ్వాలని మహేశ్ కోరగా ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన మహేశ్, సిరాజ్ తలను చెట్టుకు కొట్టి.. బండరాయితో బాదడంతో అతను అక్కడికక్కడే మరణించాడు.
Read Entire Article