తెలంగాణ మోడల్ స్కూళ్లలో అడ్మిషన్ల ప్రక్రియ సాగుతున్నది. ఆరో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో సీట్లు కలవు అని అదనపు డైరెక్టర్ శ్రీనివాసచారి తెలిపారు. విద్యార్థులు దగ్గరలోని స్కూళ్లకు వెళ్ళి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. 6, 7, 8వ తరగతులవారికి ప్రత్యేకంగా ఇంగ్లీష్ గ్రామర్ కోర్సు నేర్పిస్తున్నారని వెల్లడించారు. దీనికోసం ప్రత్యేకంగా బుక్స్ అందిస్తారు. నాణ్యమైన ప్రభుత్వ విద్యకు ఇది ప్రోత్సాహం. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మేలు జరుగుతుంది. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నది.