రేవంత్ రెడ్డి సర్కార్‌పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఫైర్ అయ్యారు. రిటైర్డ్ ఎస్సై మృతికి కాంగ్రెస్ సర్కార్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు అందకపోవడంతో.. అనారోగ్యానికి వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేక మాజీ ఎస్సై ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. ఆయన భార్య ఇప్పటికీ ఆస్పత్రిలో అవస్థలు పడుతోందని మండిపడ్డారు. వెంటనే ఆ రిటైర్డ్ ఎస్సై కుటుంబానికి బకాయిలు చెల్లించి, ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.