తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రతిపక్ష నేతలపై కేసులు అరెస్టులు విచారణలు జరుగుతూ.. రసవత్తరంగా మారుతున్నాయి. ఈ క్రమంలో.. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రివెంజ్ పాలిటిక్స్ మంచివి కాదని.. అలాంటి రాజకీయాలు చేసే వారు అధికారం కోల్పోయాక తప్పకుండా ఇబ్బందిపడాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. తాను రివెంజ్ పాలిటిక్స్‌కు దూరమని జగ్గారెడ్డి పేర్కొన్నారు.