Regional Ring Road Land Acquisition: తెలంగాణలో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి చక చకా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఉత్తర భాగం నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ షురూ చేయగా.. ఇప్పుడు భూసేకరణ కూడా మొదలుపెట్టేసింది. మొదలుపెట్టటమే కాదు వేగం పెచ్చింది కూడా. అయితే.. భూసేకరణలో చాలా మంది రైతులు భూములు ఇస్తుండగా.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అలాంటి రైతులను ఒప్పించి వారి భూములకు మంచి పరిహారం చెల్లించి మెప్పించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.