రుషికొండను ఎలా ఉపయోగించాలనుకుంటున్నారు.. మీరు కూడా సలహా ఇవ్వొచ్చు.. వివరాలివే..

10 months ago 21
విశాఖలోని రుషికొండ భవనాల వినియోగంపై ఏపీ ప్రభుత్వం ప్రజల నుంచి సలహాలు, సూచనలు ఆహ్వానిస్తోంది. రుషికొండ ప్యాలెస్‌ను ఎలా ఉపయోగించాలనే దానిపై ప్రజలు తమ సలహాలు, సూచనలు పంచుకోవచ్చని ఏపీ పర్యాటక శాఖ తెలిపింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ మెయిల్ ఏర్పాటు చేసింది. rushikonda@aptdc.inకు మెయిల్‌కు ప్రజలు తమ సూచనలు, అభిప్రాయాలను పంపవచ్చని ఏపీ టూరిజం అథారిటీ సీఈవో ఆమ్రపాలి వెల్లడించారు. ఈ సలహాలు, సూచనలను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తుందని.. ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు.
Read Entire Article