బిడ్డల భవిష్యత్తు కోసం అమ్మలు కన్న కల.. ఓ పాఠశాల నిర్మాణానికి కారణమైంది. డ్వాక్రా పొదుపు మహిళలు రూపాయి, రూపాయి పొదుపు చేసి తమ శ్రమశక్తితో ఏకంగా ఓ పాఠశాలనే నిర్మించారు. 10 వేలమంది మహిళలు ఎనిమిదేళ్ల కష్టపడి.. ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేసి అధునాతన పాఠశాల భవనాన్ని నిర్మించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని బాలభారతి స్కూలు కథ ఇది..