రెండేళ్లు ఓపిక పట్టండి.. సమస్యలన్నీ పరిష్కరిస్తా.. ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ..

2 hours ago 2
వచ్చే రెండేళ్లు సహకరిస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు. కొడంగల్ ప్రభుత్వ కాలేజీలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు రెండేళ్లు సమయం ఇస్తే.. ఇంక్రిమెంట్లు, పీఆర్సీ సహా ఉపాధ్యాయుల అన్ని సమస్యలను పరిష్కరిస్తామని మాట ఇచ్చారు. మాట తప్పితే వచ్చే ఎన్నికలలో తనకు మార్కులు వేసే నిర్ణయం కూడా ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంటుందని గుర్తు చేశారు.
Read Entire Article