వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ రెడ్ బుక్‌కు తన కుక్క కూడా భయపడదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద విడుదలైన వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ను అంబటి రాంబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అంబటి రాంబాబు.. నారా లోకేష్ రెడ్ బుక్‌లో తన పేరుందో లేదో చూసి చెప్పాలన్నారు. ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నిస్తున్నారనే తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. ఆలయాలను అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారన్న అంబటి రాంబాబు.. తిరుమల లడ్డూలో ఎలాంటి కల్తీ లేదని దర్యాప్తు సంస్థలు తేల్చాయన్నారు.