స్థానిక ఎన్నికల్లో అందరూ పొత్తు ధర్మాన్ని పాటించాల్సిందేనని, రెబల్స్‌పై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబునాయుడు సూచించారు. సీఎం అధ్యక్షత జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో రెబల్స్‌పై చర్చించారు. ఈ సందర్భంగా ప్రజలు అభ్యర్థిని చూసి కాదు.. NDAని చూసి ఓటు వేయాలని అన్నారు. అలాగే పట్టణ స్థానిక సంస్థలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పూర్తైన తర్వాత పంచాయతీ ఎన్నికలు, ఆ వెంటనే సొసైటీ ఎన్నికలు కూడా ఉంటాయని సీఎం చంద్రబాబునాయుడు తెలియజేశారు.