సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలో అమాయకులను మోసం చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో బ్రాండెడ్ వస్తువులకు రేటింగ్ ఇస్తే కమీషన్ ఇస్తామని చెప్పి సంగారెడ్డిలో ఒక ఐటీ ఉద్యోగి నుంచి రూ.54 లక్షలు దోచుకున్నారు. మొదట్లో కొద్ది మొత్తానికి లాభాలు చూపించి నమ్మకం పెంచుకొని.. ఆ తర్వాత భారీగా డబ్బులు గుంజేశారు. ఇలాంటి ఆశలకు పోయి మోసపోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.