తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించడంతో బీసీ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9 అమలుపై స్టే ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నాయకులు హైకోర్టు ఆవరణలో నిరసన తెలిపారు. ఈ పరిణామాలపై అసంతృప్తి చెందిన బీసీ సంఘాలు రేపు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. మంత్రి వాకిటి శ్రీహరి స్పందిస్తూ.. బీఆర్‌ఎస్, బీజేపీ కుమ్మక్కై రిజర్వేషన్లు అడ్డుకున్నాయని ఆరోపించారు. కోర్టు తీర్పు కాపీ చూసిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లడంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.