తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు రేపు (ఆదివారం) విడుదల కానున్నాయి. దీనికి సంబంధించి ఇంటర్ బోర్డు తాజాగా అధికారిక ప్రకటన చేసింది. ఈ ఇంటర్ పరీక్షల రిజల్స్ట్ కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇంటర్ ఫలితాలను వాట్సాప్ ద్వారా ఒక్క క్లిక్‌తో తెలుసుకునే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది.