సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఒక్కరోజైనా తన నోటి వెంట జై తెలంగాణ అనే నినాదం చేశారా అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. అలాంటి వ్యక్తి.. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తా అంటూ బయలుదేరారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీక్షా దివస్‌ను పురస్కరించుకుని.. సిద్దిపేటలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న హరీష్ రావు.. ఉద్యమ సమయం నాటి ఎన్నో జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయని హరీష్ రావు తెలిపారు.