తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ పండగ సంబరాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా బతుకమ్మ పండగను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ పండగ నిర్వహించేందుకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నెల 21వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రకరకాల కార్యక్రమాలు నిర్వహించనున్నారు.