రేషన్ కార్డుదారులకు అలర్ట్.. జస్ట్ స్కాన్ చేస్తే చాలు..

8 months ago 29
ఏపీ ప్రభుత్వం రేషన్ సరఫరా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువస్తోంది. గతంలో ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేసేవారు. ఆ విధానాన్ని రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం.. పాత తరహాలోనే రేషన్ డీలర్ల వ్యవస్థను తీసుకువచ్చింది. ప్రతి నెలా 15 రోజుల పాటు రేషన్ డీలర్ల ద్వారా సరుకులు పంపిణీ చేస్తున్నారు. అయితే రేషన్ దుకాణాల్లో మరింత పారదర్శకంగాసేవలు అందించేందుకు షాపుల వద్ద క్యూఆర్ కోడ్‌తో కూడిన బోర్డులు ఏర్పాటు చేయిస్తోంది. రేషన్ కార్డుదారులు.. రేషన్ దుకాణాల్లో అక్రమాలు గుర్తిస్తే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పిస్తు్న్నారు.
Read Entire Article