తెలంగాణలో రేషన్ కార్డుదారులకు సంక్రాంతి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం చెప్పినా సన్న బియ్యం పంపిణీకి 3 నెలలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కొత్త ధాన్యాన్ని వెంటనే మిల్లింగ్ చేస్తే బియ్యంలో నూక శాతం పెరుగుతుందని, అన్నం ముద్దగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. కనీసం 3 నెలల పాటు ధాన్యాన్ని తప్పకుండా నిల్వ చేయాల్సి ఉంటుందన్నారు. దీంతో ఉగాది నుంచి ఈ స్కీం అమలయ్యే అవకాశం ఉందని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ ముఖ్య కార్యదర్శి డీఎస్ చౌహాన్ తెలిపారు.