తెలంగాణలో సంక్షేమ పథకాలలో అనర్హులకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆదాయ ధ్రువీకరణ పత్రం దరఖాస్తుకు రేషన్ కార్డును తప్పనిసరి చేశారు. ఈ కొత్త విధానం మీ-సేవలో అమల్లోకి వచ్చింది. రేషన్ కార్డు లేనివారు దరఖాస్తు చేస్తే ‘మిస్సింగ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు’ సందేశం వస్తుంది. దీనివల్ల ఉపకార వేతనాలు, కల్యాణలక్ష్మి వంటి పథకాల్లో అవినీతి, దుర్వినియోగానికి చెక్ పడుతుందని అధికారులు భావిస్తున్నారు.