తెలంగాణ ప్రభుత్వం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాతో పాటు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. మీ సేవా కేంద్రాలు, ప్రజా పాలన కార్యక్రమాలు, గ్రామ సభలు , కుల గణన సర్వేల ద్వారా వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఈ కార్డులను మంజూరు చేస్తున్నారు. లబ్ధిదారులు ఈ కార్డుల ద్వారా చౌక ధరల దుకాణాల నుండి రేషన్ సరుకులు పొందవచ్చు. పాత, కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రారంభించిన వెబ్ పోర్టల్ ద్వారా సులభంగా పొందవచ్చు.