కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం లోతైన దర్యాప్తునకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో విచారణకు సిట్ ఏర్పాటైంది. దీంతో మాఫియా గుండెల్లో గుబులు రేగుతోంది. పోర్టులో పట్ుటకున్న స్టెల్లా నౌక నుంచి సేకరించిన బియ్యం నమూనాల పరిశీలన జరగుతుండగా.. విచారణలో సిట్ దూకుడుగా వ్యవహరించనుంది. అక్రమాలకు అండదండగా ఉన్న వ్యక్తి ఎవరో తేలనుంది. రాష్ట్రంలో ఎన్ని పోర్టులున్నా వివాదాల సుడిలో చిక్కింది మాత్రం కాకినాడ పోర్టే కావడం గమనార్హం.