రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. కీలక నిర్ణయం

1 month ago 4
రేషన్ బియ్యం అక్రమ రవాణా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ ఏర్పాటు చేసింది. ఆరుగురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. వినీత్ బ్రిజ్‌లాల్ ఈ సిట్‌కు నేతృత్వం వహిస్తారు. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి పురోగతిపై నివేదిక ఇవ్వాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు ఎన్ని సిట్‌లు ఏర్పాటు చేస్తారంటూ వైసీపీ విమర్శిస్తోంది. ప్రచారం కోసమే ఈ హడావిడి అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.
Read Entire Article