రేషన్ బియ్యం రవాణాకు తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని.. కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి స్పష్టం చేశారు. తన తమ్ముడు బియ్యం ఎగుమతి చేస్తాడు కానీ.. అతనికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. బియ్యం ఎగుమతుల్లో కాకినాడ పోర్టును నంబర్ వన్‌గా నిలిపామన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.. తనపై, తన కుటుంబంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాకినాడ పోర్టుకు చెడ్డపేరు రాకుండా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలని కోరారు.