నల్గొండ జిల్లాలోని చిట్యాల ఎమ్మార్వో కృష్ణ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. రైతు నుంచి రూ. 2 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఎమ్మార్వోను.. గురువారం నాడు చిట్యాల కార్యాలయంలో జరిగిన ఆకస్మిక దాడిలో ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణపై గతంలోనూ అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడి ఆస్తులపై విచారణ జరుగుతోంది. లంచాలు అడిగే అధికారులపై ఫిర్యాదు చేయాలని ఏసీబీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.