ఏపీ ప్రభుత్వం రైతుల కోసం మరో నిర్ణయం తీసుకుంది. ధాన్యం కొనుగోళ్లు జరుపుతున్న ప్రభుత్వం.. ఈ ప్రక్రియలో రైతులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ఫిర్యాదు చేయడానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. 1967 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెచ్చింది. ఈ విషయాన్ని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. మరోవైపు ఇప్పటి వరకూ 11.9 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని.. 2 వేల 830 కోట్ల రూపాయలను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు.