భూముల రీసర్వే విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భూముల రీసర్వే కాలాన్ని 90 నుంచి 143 రోజులకు పెంచారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ విషయాన్ని వెల్లడించారు. అత్యంత కచ్చితత్వంతో ఎలాంటి తప్పులు లేకుండా భూముల రీసర్వే చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. నాలుగో దేశలో 1613 గ్రామాలలో రీసర్వే జరుగుతోందని తెలిపారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే రియల్ టైమ్ డేటా, నావిగేషన్ సిస్టమ్ వచ్చేలా పాసుపుస్తకాలు డిజైన్ చేసినట్లు మంత్రి వివరించారు.