తెలంగాణ ప్రభుత్వం గిరిజన రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వారి కోసం కొత్త పథకాన్ని ప్రకటించింది. ఇందిర గిరి జల వికాసం పేరుతో ఈ కొత్త పథకాన్ని అమలు చేయనున్నట్లు బడ్జెట్ స్పీచ్‌లో భట్టి విక్రమార్క వెల్లడించారు. పోడు భూములు సాగు చేసే రైతులకు సోలార్ పవర్ పంపు సెట్ల ద్వారా సాగునీటిని అందించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.1 లక్షల మంది రైతులకు దీని ద్వారా లబ్ధి చేకూరనుందని తెలిపారు.