నాగర్‌కర్నూల్ జిల్లాలో ‘సేవ్ ఎర్త్ మిషన్’ సహకారంతో ‘ఈ-అన్నదాత’ సంస్థ రైతులకు విస్తృత ప్రయోజనాలను అందిస్తోంది. ఈ స్మార్ట్ కార్డు ద్వారా రైతులకు 50 శాతం సబ్సిడీతో నిత్యావసర సరుకులు, వడ్డీ లేని ముద్ర రుణాలు లభిస్తాయి. ముఖ్యంగా.. దీని ద్వారా రూ. 10 లక్షల జీవిత బీమా, వృద్ధ రైతులకు ఏటా రూ. 10,000 పెన్షన్ సదుపాయం కలుగుతుంది. అన్ని మండల కేంద్రాల్లో ఈ-అన్నదాత క్యాంటీన్‌లు ప్రారంభించి.. వ్యవసాయ పనిముట్లు, విత్తనాలు తక్కువ ధరకే అందించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.