రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 'పీఎం కుసుమ్' పథకాన్ని ప్రవేశపెట్టింది. సాగుకు పనికిరాని భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం ద్వారా రైతులు 25 ఏళ్ల పాటు స్థిరమైన ఆదాయం పొందవచ్చు. 0.5 మెగావాట్ ప్లాంట్‌కు రూ. 1.50 కోట్ల పెట్టుబడితో, బ్యాంకుల రుణ సాయంతో ఏడాదికి రూ. 15-20 లక్షల నికర ఆదాయం లభిస్తుంది.