కేంద్ర సహకారం లేకపోయినా.. రాష్ట్రంలోని మొక్కజొన్న రైతులు నష్టపోకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వమే పంట సేకరణ చేపట్టింది. ఇప్పటివరకు సేకరించిన 2.45 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నకు సంబంధించిన మొత్తాన్ని నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. దీని ద్వారా 55,904 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా, మొత్తం రూ. 588 కోట్లు నేరుగా బ్యాంక్ ఖాతాలలో జమ కానున్నాయి. రైతు సంక్షేమమే తమ మొదటి ప్రాధాన్యత అని మంత్రి తెలిపారు.