రైలులో బైక్‌ను పార్సిల్ చేయడానికి ముందు ట్యాంక్‌లో పెట్రోల్ పూర్తిగా తీసివేయాలి. వాహనం ఆర్సీ, బీమా పత్రాలు, ఆధార్ జిరాక్సులతో కనీసం 24 గంటల ముందు స్టేషన్ పార్సిల్ కార్యాలయాన్ని సంప్రదించాలి. అక్కడ దరఖాస్తు ఫారం నింపి, బరువు, దూరం ఆధారంగా చార్జీలు చెల్లించాలి. రైల్వే ఇచ్చే రసీదు అత్యంత కీలకం. గమ్యస్థానంలో అదే రసీదు చూపి బైక్‌ను కలెక్ట్ చేసుకోవచ్చు. నష్టపరిహారం కోసం పార్సిల్ బీమా తీసుకోవడం మంచిది.