సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీకి ప్రయాణించే వారికి 'వందే భారత్ స్లీపర్' రైలు ద్వారా గొప్ప ఊరట లభించనుంది. ప్రస్తుతం ఈ రూట్‌లో రాజధాని ఎక్స్‌ప్రెస్ 22 గంటలకు పైగా సమయం తీసుకుంటుండగా.. ఈ కొత్త సెమీ హైస్పీడ్ రైలు ద్వారా ప్రయాణ సమయం 3 నుండి 4 గంటల వరకు తగ్గనుంది. ఇది గంటకు 160 కి.మీ వేగంతో దూసుకెళ్తూ.. కేవలం 18 నుండి 20 గంటల్లోనే ఢిల్లీ చేర్చుతుంది. దేశంలోనే తొలి స్లీపర్ రైలును ఈ జనవరి (2026)లో కోల్‌కతా (హౌరా) - గువాహటి మధ్య ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. తర్వాత సికింద్రాబాద్ - న్యూఢిల్లీ రూట్‌లో పట్టాలెక్కే అవకాశం ఉంది.