హైదరాబాద్-బెంగళూరు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు జూలై 10 నుంచి రెట్టింపు సామర్థ్యంతో అందుబాటులోకి రానుంది. 8 కోచ్‌ల స్థానంలో 16 కోచ్‌లు ఉండటంతో 1,128 మంది ప్రయాణించవచ్చు. అధిక రద్దీ దృష్ట్యా రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఐటీ నగరాల మధ్య ప్రయాణించే వారికి ఇది మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.