రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. వరంగల్ మీదుగా కొత్త ఎక్స్‌ప్రెస్.. వారానికి ఐదు రోజుల పాటు..

10 months ago 9
రైల్వే ప్రయాణికులకు ఊరట కలిగిస్తూ.. చెన్నై సెంట్రల్-భగత్‌కి కోటి ఎక్స్‌ప్రెస్ వరంగల్ మీదుగా వారానికి ఐదు రోజులు నడవనుంది. ఈ రైలు సూరత్, అహ్మదాబాద్ మీదుగా ప్రయాణిస్తుంది. వరంగల్ నుండి ఈ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. చెన్నైలో సాయంత్రం 7.45 గంటలకు బయలుదేరి వరంగల్‌కు ఉదయం 4.46 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో భగత్‌కి కోటిలో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి వరంగల్‌కు మధ్యాహ్నం 12.08 గంటలకు చేరుకుంటుంది. వారం ఐదు రోజులు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
Read Entire Article