ఉపాధి హామీ పథకంలో ముఖ హాజరు విధానం తీసుకువచ్చిన తర్వాత ఏజెన్సీ ప్రాంతాల్లో అటెండెన్స్ కోసం ఉపాధి కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. సిగ్నల్స్ సరిగా రాకపోవటంతో హాజరు నమోదు కోసం కొండ ప్రాంతాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే అల్లూరి జిల్లా బొంగిజ గ్రామంలోని ఉపాధి కూలీలు.. అటెండెన్స్ కోసం రోజూ కొండెక్కాల్సి వస్తోంది. ఉదయం, సాయంత్రం హాజరు నమోదు కోసం పడిగాపులు కాయాల్సి వస్తోందని వారు వాపోతున్నారు.